ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌కు చేరుతున్న వరద నీరు (Ongole | Gundlakamma Project | Rainy Water | People | Inflow | Out Flow)
ఒంగోలు తదితర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టులో భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది.
గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో భారీగా వరద నీరు చేరుతుండటంతో గురువారం నాడు నాలుగు గేట్లు ఎత్తివేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదిలేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఇన్‌ఫ్లో ఆరు వేల క్యూసెక్కులు నమోదైందని అవుట్ ఫ్లో 5400 క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది ప్రాజెక్ట్ వద్ద అప్రమత్తంగా ఉన్నారని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదిలావుండగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రాథమిక సమాచారం.