గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆయన రెండు రోజుల పాటు 15 డివిజన్లలో ప్రచారం చేస్తారు.
కాగా, ఈ ప్రచారానికి బయలుదేరే ముందు జగన్ ముందుగా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగన్ నాంపల్లిలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, స్థానిక దర్గాలోనే ఆయన ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
తన తండ్రి కొనసాగించిన సెంటిమెంట్‌ను జగన్ కూడా కొనసాగిస్తున్నారు. గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహించిన చేవెళ్ళ నుంచి ప్రచారం ప్రారంభించినట్టే ఇపుడు జగన్ సైతం ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం నుంచి ప్రచారం ప్రారంభించడం గమనార్హం.