జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణా మహిళల రక్షణలో కేసీఆర్ ఆమరణ దీక్ష! (KCR | Security | TRS | Fasting | Police | Arrest | Regional)
Feedback Print Bookmark and Share
 
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఈనెల 29వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్ష పూర్తిగా మహిళా రక్షణలో సాగనుంది. తన దీక్షకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఉండేందుకు వీలుగా తెరాస ఈ ఎత్తుగడ వేసింది.

ఇదిలావుండగా, దీక్ష కోసం యాభై ఎకరాల విస్తీర్ణాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ ఏర్పాట్లు చేరుకుగా సాగుతున్నాయి. ముఖ్యంగా అధినేత కేసీఆర్ చేపట్టే ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయకుండా పార్టీ శ్రేణులు విస్తృతమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి.

కేసీఆర్‌ దీక్షా వేదిక చుట్టూ ఐదు వలయాలను ఏర్పాటు చేయనున్నారు. మొట్టమొదటి వలయంలో అంటే దీక్షా వేదికకు ఎదురుగా భారీ సంఖ్యలో మహిళలతో కవచం ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఒకవైపు ఉంటే, వారికి మరోవైపు లేదా వేదికకు ఎదురుగా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలెరీని ఏర్పాటు చేస్తున్నారు.

మీడియా సమక్షంలో మహిళలు ఉంటే.. వారిపై లాఠీ ఛార్జ్ చేసేందుకు పోలీసులు వెనుకంజ వేస్తారన్నది తెరాస నేతల వ్యూహంగా ఉంది. అలాగే, ఈ దీక్షకు భారీ ఎత్తున జనసమీకణ చేయనున్నారు. అలాగే, ఈ దీక్షకు జాతీయ స్థాయి మీడియా సైతం ప్రాధాన్యం ఇస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.