దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేసిన గ్రేటర్ అభివృద్ధిపై పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ స్థాయి నగరం తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా శివారు మున్సిపాలిటీలను కలిపి గ్రేటర్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్. రాజశేఖర రెడ్డిదేనని డీఎస్ అన్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనస్థలిపురం డివిజన్ రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన సభలో డీఎస్ మాట్లాడుతూ.. రూ. 26 వేల కోట్లతో వైఎస్సార్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎస్ శుక్రవారం వనస్థలిపురం, మలక్‌పేట, ఎల్‌బీనగర్, మన్సూరాబాద్‌లలో డీఎస్ రోడ్ షోలు నిర్వహించారు.