జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కుర్చీ మాదే: బాలయ్య (Balakrishna | Hyd | Greater | Election compaign | TDP | Congress)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ జోస్యం చెప్పారు. శుక్రవారం ఉదయం ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేయర్ కుర్చీ తమదేనని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో తెదేపా పవనాలు వీస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు సాగిస్తున్న అవినీతే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి తొలిమెట్టు అని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ వంద డివిజన్లలో విజయకేతనం ఎగరువేస్తుందని, మేయర్ పదవిని దక్కించుకుంటుందన్నారు. బాలకృష్ణ ప్రచారంలో దిగడంతో డివిజన్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల్లో సమరోత్సాహం నెలకొంది.

బాలకృష్ణ రోడ్ షోలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు.. బాలయ్య.. సైదాబాద్‌లోని భవానీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి తరపున ప్రచారం చేపట్టారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.