ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని చూసి కాంగ్రెస్ యువనేతలు నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హితవు పలికారు. తనను భావి ప్రధానిగా చూడవద్దని వినయంగా ప్రకటించిన రాహుల్ గాంధీ రాజకీయాల్లో యువనాయకులకు ఆదర్శప్రాయుడిగా మారారని వీహెచ్ ప్రశంసించారు.
రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన హుందాతనానికి ఆదర్శమని వీహెచ్ కొనియాడారు. మంత్రి పదవిని కూడా వద్దని నిరాకరించి పార్టీ కోసం రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారని హనుమంతరావు ప్రశంసల వర్షంతో కురిపించారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర పర్యటనలో భాగంగా తనను భావి ప్రధానిగా చూడొద్దని ప్రకటించిన రాహుల్ గాంధీని పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడారు. వీరిలో పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.