ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాష్ట్రంలో రోశయ్యది ధృతరాష్ట్ర పాలన: టీడీపీ (Rosaiah| Telugu Desam Party| YSR| Congress| Gali Janardhan Reddy| Jagan| News)
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యది ధృతరాష్ట్ర పాలన అని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో అక్రమాలు పెచ్చరిల్లిపోతున్న ముఖ్యమంత్రి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెదేపా ఆరోపించింది.
ఓబుళాపురం గనుల అక్రమాలు, బ్రాహ్మణీ స్టీల్ కర్మాగారానికి, మైలవరం రిజర్వాయర్ ద్వారా అక్రమంగా రెండు టీఎంసీల నీటి కేటాయింపుల గురించి ప్రభుత్వానికి అన్నీ తెలిసినా వాటిపై చర్యలు తీసుకోవడానికి నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి దుమ్మెత్తిపోశారు.
ఇంకా ఈ విషయాలు అన్ని తెలిసిన ముఖ్యమంత్రి రోశయ్య మరో ధృతరాష్ట్ర పాలన చేస్తూ.. కళ్లుండి చూడలేక అక్రమాలను అరికట్టలేకపోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. గాలి జనార్ధనరెడ్డి, వైఎస్ జగన్ తదితర జె-గ్యాంగ్ నేతల ఆస్తులు పెంచేందుకే ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.