జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » డిసెంబరు 19న పులివెందులు ఉప ఎన్నిక పోలింగ్! (By-polls | four assembly | segments | December | Polling | Pulivendula)
Feedback Print Bookmark and Share
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన పులివెందుల నియోజకవర్గానికి డిసెంబరు 19వ తేదీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ సెగ్మెంట్‌తో పాటు తమిళనాడు, మణిపాల్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా అదే రోజున పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఢిల్లీలో ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందుల స్థానంతో పాటు.. తమిళనాడులోని తిరుచ్చెందూరు, వందవాసి అసెంబ్లీ సెగ్మెంట్లు, మణిపాల్లోని యాస్కుల్ స్థానాలకు 19న పోలింగ్ జరుగుతుందని, 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని సంఘం ప్రకటించింది. కాగా, పులివెందులలో వైఎస్సార్ దుర్మరణం వల్ల ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలాగే, వందవాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన అధికార డీఎంకే సభ్యుడు జయరామన్ అకాలమరణం చెందారు. తిరుచ్చెందూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన అనితా రాధాకృష్ణన్ రాజీనా చేశారు. అన్నాడీఎంకేకు చెందిన ఈ నేత ఆ పార్టీకి స్వస్తి చెప్పి డీఎంకేలో చేరడంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.