జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం నేటితో పరిసమాప్తం! (GHMC | Compaign | End | TDP | Congress | PRP | Rosaiah | Chiru | Babu)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడనుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎలాంటి ప్రచారం చేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చని తెలిపింది.

కాగా, గత వారం పదిరోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లలో సాగిన ఈ ప్రచారం నగరంలో హోరెత్తి పోయింది. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్‌తో పాటు.. రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేత, హీరో బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున ఆ పార్టీ అధినేత చిరంజీవి పాల్గొని ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఇకపోతే.. కాంగ్రెస్, తెదేపాలు 150 డివిజన్‌లలో పోటీ చేస్తుండగా, ప్రజారాజ్యం పార్టీ మాత్రం 64 వార్డుల్లోనే బరిలోకి దిగింది. భాజపా, లోక్‌సత్తా, వామపక్ష పార్టీలు కూడా తమకు పట్టున్న డివిజన్‌లలో పోటీ చేస్తున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.