ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ముఖ్యమంత్రిగా రోశయ్య... ఓ వేస్ట్ ఫెలో: చంద్రబాబు (Chandrababu | OMC | Rosaiah | CM | Maining | TDP | Congress)
రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించే అర్హతలు కొణిజేటి రోశయ్యకు ఏమాత్రం లేవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సీఎంగా ఓ వేస్ట్ ఫెలోతో సమానమని బాబు ఆరోపించారు. ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్‌ను అరికట్టలేక పోయినందుకు ముఖ్యమంత్రిగా రోశయ్య తలదించుకోవాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి చర్య తీసుకోక పోతే.. తామే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చంద్రబాబు హెచ్చరించారు.
శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బాబు మీడియాతో మాట్లాడుతూ.. రోశయ్య పనితీరుపై ధ్వజమెత్తారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను తలదన్నే రీతిలో రాష్ట్రంలో ఇనుప ఖనిజం మాఫియా సాగుతోందని, ఇది రాష్ట్రానికి ఏమాత్రం క్షేమతరం కాదన్నారు. ఓబుళాపురం గనుల తవ్వకాల్లో అక్రమాలపై సుప్రీం సాధికారిక కమిటీ నివేదిక కూడా తప్పుబట్టిందని బాబు గుర్తు చేశారు.
ప్రతిరోజూ మూడు వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా మాఫియా తవ్వుకుంటోందన్నారు. దీనివల్ల రోజుకు పది కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని మాఫియా జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు. ఏకంగా కర్ణాటక ప్రభుత్వం మైనింగ్ మాఫియా శాసించిందన్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ కూడా తలొగ్గడం సిగ్గుచేటని అన్నారు. ఓఎంసీలో అక్రమాలు భారీగానే జరుగుతున్నాయని తెలిసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఎంతవరకు సబబని చంద్రబాబు ప్రశ్నించారు.