జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చంద్రబాబుకు విశ్వసనీయత లేదు: వైఎస్. జగన్ (Chandra Babu| Jagan| News| AP News| Greater Elections| YSR| Sonia Gandhi)
Feedback Print Bookmark and Share
 
Jagan
FILE
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు.

ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, కానీ ఏనాడూ మాటమీద నిలబడే అలవాటు చంద్రబాబు నాయుడుకు లేదని జగన్ ధ్వజమెత్రారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అడ్డాగుట్టలో జగన్ మాట్లాడుతూ.. కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం అంశాల్లో చంద్రబాబు మాట తప్పారన్నారు. చంద్రబాబు హయాంలో గ్రేటర్ పరధిలో కేవలం 550కి మించిన ఇళ్ల నిర్మాణమే జరిగిందని జగన్ తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే 70వేల ఇళ్ల నిర్మాణం, 6.5 లక్షల తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యాయని జగన్మోహన రెడ్డి గుర్తు చేశారు.

అందుచేత గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తన తండ్రికి నివాళిగా అంకితమివ్వాలని జగన్ ప్రజలను కోరారు. బడుగులకు రెండు రూపాయలకే కిలో బియ్యం దొరుకుతుందంటే ఆ ఘనత సోనియాగాంధీ, వైఎస్సార్‌లరేదని ఆయన వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.