జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం (GHMC | Hyd | Election | EC | Compaign | End)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. శనివారం సాయంత్రం నుంచి 24వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీన మంగళవారం జరిగే ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 26 వేల మంది సిబ్బందిని బందోబస్తుగా నియమించారు.

పోలింగ్ జరిగే 24 గంటల ముందుగా నుంచి పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. కాగా, పోలింగ్ సమయంలో ఎలాంటి అక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నట్టు గుర్తిస్తే ఎన్నికల సంఘం ప్రకటించిన ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడించారు.

టోల్ ఫ్రీ నంబర్లు.. 100, 1090, హైదరాబాద్.. 2326 1666, 94906 16690, సైబరాబాద్..27853943, 9490617100. మద్యం పంపిణీ, అక్రమ రవాణా, నిల్వలపై 24737780, 24657470. ఎస్ఎంఎస్.. 9010100100, 9640100100.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.