జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వైఎస్ కుటుంబానికే పులివెందుల టిక్కెట్: ధర్మపురి (YS Family | Ticket | Pulivendula | By election | PCC Chief | DS)
Feedback Print Bookmark and Share
 
పులివెందుల ఉప ఎన్నికల టిక్కెట్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కటుంబానికే కేటాయించనున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు. కాగా, వచ్చే నెల 19వ తేదీన పులివెందుల స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనున్న విషయం తెల్సిందే.

దీనిపై ధర్మపురి శనివారం మాట్లాడుతూ.. పులివెందుల అసెంబ్లీ టిక్కెట్‌ను వైఎస్ కుటుంబ సభ్యులకే కేటాయించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అనేకంగా, వైఎస్ సతీమణి విజయలక్ష్మీ లేదా ఆయన కుమార్తె షర్మిలకు కేటాయించే అంశంపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ఇదిలావుండగా, వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఈ నియోజకవర్గవర్గ పాలనా వ్యవహారాలను చక్కదిద్దుతూ వచ్చిన సోదరుడి కుమారుడు వైఎస్.భాస్కర్ రెడ్డి బరిలోకి దించే యోచనలో వైఎస్ కుటుంబ సభ్యులు ఉన్నారు.

అయితే, ఇదే జరిగితే ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేక పోలేదు. అందువల్ల వైఎస్ సతీమణికే టిక్కెట్ కేటాయిస్తే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపై వైఎస్ కుటుంబ సభ్యులు తర్జన భర్జనలు పడుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.