జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఆమరణ దీక్షకు ముందే కేసీఆర్ గృహ నిర్భంధం! (Telangana | KCR | TRS | Siddipeta | Fast | Police | House Arrest)
Feedback Print Bookmark and Share
 
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనలో భాగంగా ఈనెల 29వ తేదీ నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహారదీక్షను తలపెట్టారు. పలు రోగాలతో బాధపడుతున్న ఆయన.. ఈ దీక్షకు పూనుకుంటే ఆరోగ్యానికి మరింత ప్రమాదమని ఆయన వ్యక్తిగత వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, కేసీఆర్ మాత్రం ముందుగా ప్రకటించినట్టుగా దీక్షను చేపట్టితీరాలనే అకుంఠిత దీక్షతో ఉన్నారు.

దీంతో కేసీఆర్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్షకు రెండు రోజుల ముందుగానే గృహ నిర్భంధంలోకి తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం భావిస్తోంది. ఇది వీలుపడని పక్షంలో దీక్ష ప్రారంభమైన రెండు రోజుల తర్వాత బలవంతంగానైనా అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.

కాగా, ప్రస్తుతం కేసీఆర్‌కు అధిక రక్తపోటుతో పాటు.. మధుమేహం, తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా, మధుమేహ వ్యాధి ఉన్న కారణంగా ఆయన రెండు రోజులకు మించి దీక్షలో ఉండలేరని కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎం.వి.రావు చెబుతున్నారు.

అయితే, ఇవేమీ పట్టించుకోని కేసీఆర్.. సిద్ధిపేట సమీపంలోని కొన్యాపల్లిలో వారం రోజులు విశ్రాంతి తీసుకుని అక్కడ వేంకటేశ్వర స్వామికి అర్చన చేసి సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన వేదికపై ఈనెల 29వ తేదీన దీక్షలో కూర్చోవాలని భావిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.