జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఒక్క సీటు ఎక్కువ గెలిచినా రాజీనామా చేస్తా: రోశయ్య (Rosaiah | Chandrababu | Resign | GHMC | TDP | Congress | Win)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి తమ పార్టీ కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రకటించారు. ఈ సవాల్‌ను చంద్రబాబు స్వీకరించేందుకు సిద్ధమా అంటు సవాల్ విసిరారు.

ఆదివారం ఆయన సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల భయం పట్టుకుందన్నారు. ఫలితంగా ఆయన పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఘన చరిత్ర ఏపాటిదో తాను ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదన్నారు. అందువల్ల ఆయన ఘన చరిత్ర పాలనపై ఓ స్కాలర్ పరిశోధన చేసి గౌరవ డాక్టరేట్‌ను కూడా పొందారని గుర్తు చేశారు.

ఇలాంటి అవకాశం ఏ ఒక్కరికీ దక్కదని, చరిత్రలోని యుగపురుషులకే దక్కుతుందన్నారు. అందుకే ఆయనకు ఓ సవాల్ చేస్తున్నానని దీనికి బాబు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. సోమవారం జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఒక్క కార్పొరేటర్‌ స్థానాన్ని తెదేపా కైవసం చేసుకున్నా తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తమ పార్టీ అధిష్టానానికి, గవర్నర్‌కు పంపి.. మీ ముందుకు వచ్చి ప్రకటన చేస్తానని రోశయ్య ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.