తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత గోనె ప్రకాష్ రావు చీము.. నెత్తురుతో పాటు.. మగతనం లేని నేత అని కాంగ్రెస్ పార్టీ నేత గోనే ప్రకాష్ రావు దుయ్యబట్టారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రామోజీ ఫిల్మ్‌సిటీని నాగళ్ళతో దున్నుతామని కేసీఆర్ ప్రకటించారన్నారు.
ఇదే ప్రశ్న ఇపుడు తాము అడుగుతున్నామన్నారు. చీము, నెత్తురు, మగతనం ఉంటే కేసీఆర్ లేదా ఆయన కుమారుడు లేదా కూతురు లేదా మేనల్లుడు హరీష్ రావులలో ఏ ఒక్కరైనా ఆ భూములపై చర్చించడానికి ముందుకు రావాలని గోనె సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజల పొట్ట కొట్టేందుకే రామోజీరావు ఇక్కడకు వచ్చారన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో పని చేస్తున్న వారిలో 10 వేల మంది కార్మికులు కనీస వేతనాలు, బోనస్ లేకుండా పని చేస్తున్నారని అన్నారు. ఫిల్మ్ సిటీలో 1300 ఎకరాల భూములు గాలీబ్ జంగ్ వారసులకు చెందినవని ఆయన తెలిపారు. నిజామ్ ప్రభుత్వంలో పని చేసిన గాలీబ్ జంగ్‌కు బహుమానంగా నిజాం ప్రభువులు ఇచ్చారని గుర్తు చేశారు.
ఇకపోతే.. గోనె సరికొత్త నినాదానాన్ని తెరపైకి లేవదీశారు. "ఆంధ్రావాలా జాగో.. బీహారీ వాలా భాగో" అంటూ నినాదం చేశారు. వెలమకులానికి చెందిన కేసీఆర్ వంటి నేతలు బీహార్ నుంచి రాష్ట్రానికి వలస వచ్చారన్నారు. వీరిని బీహార్ వెళ్ళగొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు.