గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు సోమవారం జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ సజావుగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఏవీఎస్.రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రేటర్ పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఇదిలావుండగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లలో 5718 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. పారదర్శక పోలింగ్ కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా వీడియోగ్రఫీ, డిజిటల్ ఫోటోగ్రఫీ ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.