గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి జూబ్లీహిల్స్‌లోని డీఈబీఎస్ఎస్ఎల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
అలాగే, సినీ నటుడు బాలకృష్ణ తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటుడు నాగార్జున, ఆయన సతీమణి అమల, హీరో పవన్ కళ్యాణ్‌లు ఓటు వేశారు. వీరితో పాటు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజ్‌లు జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ముఖ్యమంత్రి కె.రోశయ్య అమీర్‌పేట డివిజన్‌లోని 26వ బూత్‌లో ఓటు వేశారు. మంత్రి దానం నాగేందర్ బంజారాహిల్స్‌లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.