ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » పోలింగ్ ఏర్పాట్లను ఈసీ సీరియస్‌గా తీసుకోలేదు: బాబు (Greater Elections| Polling| News| AP News| Chandrababu Naidu| Telugu Desam Party)
పోలింగ్ ఏర్పాట్లను ఈసీ సీరియస్‌గా తీసుకోలేదు: బాబు
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఓటు హక్కును వినియోగించిన అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ సిబ్బందికి, ఈవిఎంలకు ఒకే టేబుల్‌ను వాడుతున్నారని, దీనివల్ల సీక్రసీ ఆఫ్ ఓటింగ్‌కు భంగం కలుగుతుందన్నారు.
ఇంకా పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను బయట కూర్చోబెట్టారని బాబు చెప్పారు. పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషనరే స్వయంగా వచ్చి ఏర్పాట్లను పరిశీలించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.