జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రెండు గంటల్లో పది శాతం పోలింగ్ నమోదు: కృష్ణబాబు (Greater Elections| Polling| Krishnababu| News| AP News)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లో పదిశాతం వరకు పోలింగ్ నమోదైందని గ్రేటర్ ఎన్నికల అధికారి కృష్ణబాబు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు బాగా పనిచేస్తున్నాయని కృష్ణబాబు తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణబాబు చెప్పారు. ఈవీఎంల వాడకంపైప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయని కృష్ణబాబు గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే.. పాతబస్తీలో పోలింగ్ మందకొడిగా జరుగుతున్న మాట వాస్తవమేనని కృష్ణబాబు తెలిపారు. ఇప్పటివరకు ఆరు ఫిర్యాదులు అందాయని ఆయన వెల్లడించారు. భద్రత విషయంలో ఎలాంటి లోపం లేదని కృష్ణబాబు తెలిపారు. పాతబస్తీలో ఇప్పటివరకు కేవలం 15 శాతం పోలింగ్ మాత్రమే నమోదైందని కృష్ణబాబు చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.