జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు: ముఖ్యమంత్రి రోశయ్య (Greater Elections| Polling| Voter| Chief Minister| K. Rosaiah| News| AP News)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమిటని? మీడియా అడిగిన ప్రశ్నకు ఓటర్లు చాలా తెలివైన వాళ్లని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య సమాధానమిచ్చారు. ఓటర్లకు అన్ని బాగా తెలుసునని, చైతన్యవంతులని సీఎం అన్నారు. అంతేగాకుండా ఓటర్లకు ముఖ్యమంత్రిగా తానేమీ చెప్పాల్సిన అవసరం లేదని రోశయ్య పేర్కొన్నారు.

హైదరాబాద్ గ్రేటర్ నగరపాలక సంస్థ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే 20 శాతం ఓట్లు నమోదైనట్లు గ్రేటర్ ఎన్నికల అధికారి కృష్ణబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య అమీర్‌పేటలోని 26వ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.