జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రోశయ్య ధృతరాష్ట్రుడైతే.. నాగేందర్ దుర్యోధనుడు..! (Greater Elections| Rosaiah| Danam Nagender| Yerram Naidu| News| AP News)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన జరుగుతుందని ఇటీవల ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. రోశయ్య ధృతరాష్ట్రుడు అయితే దానం నాగేందర్ దుర్యోధనుడిలా చెలరేగుతున్నారని తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్ అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్‌కు గ్రేటర్ ఎన్నికల ద్వారా చివరి ప్రయత్నం చేస్తోందని రావుల జోస్యం చెప్పారు. ఓటర్లపై నమ్మకం ఉంటే కాంగ్రెస్ ఎందుకు దౌర్జన్యానికి పాల్పడుతుందని దానం ప్రశ్నించారు.

మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు ఆరోపించారు. ఓటుకు వెయ్యి రూపాయలిచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.