ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ సమరం: ఓటేసిన టెన్నిస్ తార సానియా మీర్జా (Greater Elections| Sania Mirza| NTR| Rajasekhar| Jeevitha| Krishna)
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖ టాలీవుడ్ స్టార్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఓటు హక్కును వినియోగించారు. కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే టాలీవుడ్ ప్రముఖ దంపతులు జీవితారాజశేఖర్, కృష్ణ- విజయనిర్మత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక సందర్భంగా జూబ్లీ హిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఈ ఇరువురు దంపతులు ఓటు వేశారు.
అలాగే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మెహదీ పట్నంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని ప్రతి ఓటరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.