జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » త్రిసభ్య కమిటి నివేదికను బహిర్గతం చేయాలి: తెదేపా (OMC | TDP | Congress | Maining | Govt | Three member committee)
Feedback Print Bookmark and Share
 
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పరిశీలించి సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఓఎంసీ కంపెనీకి ప్రభుత్వం అందదండలు పుష్కలంగా ఉన్నాయన్నాని ఆరోపించారు.

అందువల్లే వారు యధేచ్చగా సరిహద్దులు చెరిపేసి అక్రమ మైనింగ్‌ తవ్వకాలు సాగిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా, ఓఎంసీ, రెడ్‌గోల్డ్ సంస్థలు తమ రికార్డులను తారుమారు చేసుకునేందుకు ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఓబుళాపురం మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు భారీగా చోటు చేసుకున్నట్టు సుప్రీం కోర్టు సాధికారిక కమిటీ తేల్చి చెప్పినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం మిన్నకుండి పోయిందన్నారు.

దీనిపై వివిరణ ఇచ్చుకోకుండా ఉండేందుకు సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాసిందన్నారు. అయితే, కేంద్ర హోంమంత్రి చిదంబరం మాత్రం తమకెలాంటి లేఖ అందలేదని చెబుతున్నారని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.