జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » విద్యాసంస్థల బంద్‌కు బీసీ సంఘాల పిలుపు (BC| Education| Bandh| Syudents| News| AP News)
Feedback Print Bookmark and Share
 
విద్యాసంస్థల బంద్‌కు బీసీ సంఘాలు పిలుపు నిచ్చాయి. ఉపకార వేతనాలు, బోధనా రుసుములపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం విద్యా సంస్థల బంద్ జరుగనుంది.

విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క రెన్యువల్ విద్యార్థికి స్కాలర్‌షిప్ మంజూరు చేయలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.

ఉపకారవేతనాలు, బోధనా రుసుములపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలనే డిమాండ్‌తోనే బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. పోస్టుమెట్రిక్ బీసీ విద్యార్థుల సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రూ. 20వేలకు మించి మంజూరు చేయరాదన్న సర్కారు నిర్ణయం బీసీ వ్యతిరేక చర్య అని కృష్ణయ్య ఆరోపించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.