జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » శాంభవి, ఉషారాణిలపై నంద్యాలలో విచారణ (Sabhavi| Usha rani| Nadyala| Human rights commission| Surya Nandi| News| Ap News)
Feedback Print Bookmark and Share
 
మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం శాంభవి, ఉషారాణిలపై నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో విచారణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హేతువాద సంఘాలు నంద్యాల చేరుకున్నాయి.

సూర్యనంది ఆలయంలో పాగా వేసిన వివాదాస్పద బాలిక శాంభవి సంరక్షకురాలు ఉషారాణి లీలలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సూర్యనంది పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సొంత అవసరాలకు వాడుకొనే క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులపై పెత్తనం చెలాయించింది. అంతేగాకుండా ఆలయంలో వివాహాది శుభకార్యాలకు భక్తులను అనుమతించకుండా ఆంక్షలు అమలు చేసింది. అంతేగాకుండా.. ఉషారాణి గుడిలో అడుగుపెట్టిన తర్వాత భక్తులపై దౌర్జన్యాలు పెరిగాయి.

దీంతో బడికి వెళ్లాల్సిన వయసులో ముక్కుపచ్చలారని చిన్నారిని గుడిలో కూర్చోబెట్టి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయిస్తుందని ఉషారాణిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అంతర్జాతీయ మానవవాద-హేతువాద సంఘాల సమాఖ్య.. మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు మేరకు మంగళవారం మానవ హక్కుల సంఘం శాంభవి, ఉషారాణిల వద్ద నంద్యాల ఆర్టీవో కార్యాలయంలో విచారణ జరుపనుందని తెలిసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.