పార్టీకోసం ఏళ్ల తరబడి కష్టపడిన కొమ్మినేని శేషగిరిరావుకు తగిన న్యాయం జరగలేదని రావీగాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు నాగుండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పందించారు.
అర్హులైన అందరికీ పదవులు వస్తాయనుకోవడం ఏ మాత్రం సబబు కాదని, అర్హతతో పాటు అదృష్టమూ కలిసి రావాలని ముఖ్యమంత్రి అన్నారు. గాంధీభవన్‌లో జరిగిన కొమ్మినేని శేషగిరిరావు స్మారక అవార్డుల కార్యక్రమంలో సీఎం హాజరయ్యారు.
శాసనమండలి ఛైర్మన్ చక్రపాణితో పాటు పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షుడు చిన్నమల్లు రాయుడుకు సీఎం రోశయ్య, పీసీసీ చీఫ్ డీఎస్‌లు కొమ్మినేని స్మారక అవార్డులను అందించారు. అర్హత ఉంటేనే పదవులను అలకరించడం సులభమని భావించడం సబబు కాదని రోశయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.