జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » డాలర్ శేషాద్రి పదవీకాలం పొడగింపుపై స్టే రద్దు! (Dollar Seshadri | High court stay | Supreme court | Dollar Scam)
Bookmark and Share Feedback Print
 
డాలర్ శేషాద్రి పదవీకాలం పొడగింపుపై రాష్ట్ర హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు మంగళవారం తొలగించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి శేషాద్రి పదవీ కాలాన్ని పెంచుతూ తితిదే గతంలో రెండు మార్లు పొడగించంది. తితిదేలో డాలర్ల మాయానికి సంబంధించి శేషాద్రిపై అనుమానాలున్నాయని, ఈ పరిస్థితుల్లో ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం సముచితం కాదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆయన పదవీకాలం పెంపు ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ స్టేను సవాల్ చేస్తూ శేషాద్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శేషాద్రి కేసును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు హైకోర్టు స్టే ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో ఆయన తితిదే పదవిలో కొనసాగనున్నారు. సుప్రీం కోర్టు స్టే ఎత్తివేసిన వెంటనే శేషాద్రిని పదవిలో కొనసాగాల్సిందిగా తితిదే ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆదేశించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.