ఓబుళాపురం గనులతో సహా మరో 6 గనుల్లో అక్రమ తవ్వకాలు జరిగిన మాట వాస్తవమని సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ నిర్థారణకు వచ్చింది. ఈ మేరకు కమిటీ ఆ గనులలో మైనింగ్ తక్షణమే నిలిపి వేయాలని రాష్ట్రాన్ని కోరింది.
ఓఎంసీతో సహా మిగిలిన ఆరు గనుల్లో తవ్విన ఇనుప ఖనిజం రవాణాను తక్షణమే నిలుపుదల చేయాలని సర్కారుకు సూచించింది.
సాధికార కమిటీ ఆదేశాల నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అత్యవసరంగా గనుల శాఖామంత్రి బాలినేని, సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గనుల అక్రమంపై ఎలా స్పందించాలన్నదానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.