జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ ఎన్నికలు: ఓట్ల లెక్కింపుకు పటిష్ట భద్రత (Grater Elections| Polling| Counting| News| AP News)
Bookmark and Share Feedback Print
 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమరం మంగళవారంతో పూర్తి కావడంతో ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26న జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంతర సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. గురువారం (26-11-09) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 9 గంటలకే ఎన్నికల ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.

అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాలు, గ్రేటర్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో 144 సెక్షన్ విధించారు. మల్కాజిగిరి డివిజిన్ డిఫెన్స్ కాలనీ 41, 42 పోలింగ్ కేంద్రాలు, శ్రీనగర్ కాలనీ 16వ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.