జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » డిసెంబర్‌ తొలివారంలో హస్తినకు సీఎం పయనం (Rosaiah| Delhi| December| PCC| Greater Elections| Mayor| CLP| News| AP News)
Bookmark and Share Feedback Print
 
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య డిసెంబర్ మొదటివారంలో హస్తినకు వెళ్లే అవకాశాలున్నాయని తెలిసింది. సీఎల్పీ భేటీ నుంచి గ్రేటర్ మేయర్ పదవి వరకు వివిధ అంశాలపై అధిష్టానంతో చర్చించేందుకు రోశయ్య ఢిల్లీకి పయనమవుతారని పార్టీ శ్రేణుల సమాచారం.

గ్రేటర్ మేయర్ అభ్యర్థి ఎవరనే విషయమై పీసీసీ ఓ నిర్ణయానికి వస్తుంది. తదనంతరం అభ్యర్థుల వివరాలతో ఢిల్లీ పెద్దలను కలవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే.. ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు రోశయ్య బుధవారం విశాఖపట్నం చేరుకుంటారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం, ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఆదివారం సీఎం వెళతారని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.