రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలపాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాళ్ళను ఎర్రబెల్లి దయాకరరావు పట్టుకుని వేడుకున్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా తమ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్ళానని, ఈ సందర్భంగా తెలంగాణ కోసం మద్దతు తెలపాల్సిందిగా తాను తమ అధ్యక్షుని కాళ్ళు పట్టుకున్నట్లు తెదేపా నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
ఇదివరకు తాను ఎప్పుడూ కూడా పదవుల కోసం, అధికారం కోసం ఎవ్వరి కాళ్ళు పట్టుకోలేదని, కాని ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతు తెలపమని తమ అధ్యక్షుని కాళ్ళు పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.