ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చంద్రబాబుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వండి: తెదేపా (TDP | President | Congress | GMK | Yerrannaidu | Friday | Media | TRS)
ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోతే తమ అధ్యక్షునికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నేతలు సూచించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎర్రన్నాయుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లుడుతూ దేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయంపై కేంద్రం తర్జనభర్జనలు పడుతోందన్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని, ఈ సమస్యను పరిష్కరించుకోలేకపోతే తమ పార్టీ అధ్యక్షునికి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే తమ సత్తా ఏంటో నిరూపిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణపై చంద్రబాబు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించడం సరికాదని, ఆయన తన నిర్ణయం చెబితే దానిని పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రవేశపెడతారా అని ఆయన ప్రశ్నించారు.
ఎర్రన్నాయుడు మాట్లాడుతూ తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వింత వైఖరిని అవలంబిస్తోందని, చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ముఖ్యంగా తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానాన్ని వెల్లడించాలన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోదని, ఈ విషయం కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితికి తెలుసునని, ఇరుపార్టీలకు ఈ విషయం స్పష్టంగా తెలుసునని ఆయన పేర్కొన్నారు.