ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ప్రజా దర్బార్ నిర్వహించిన గవర్నర్ నర్సింహన్ (State | AP | Governor | Narsimhan | New Year | People | Ministers | CM)
రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ నూతన సంవత్సరం తొలి రోజున రాజ్‌భవన్‌లో ప్రజా దర్బారు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రోశయ్య, హోం శాఖామంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఇతర మంత్రులు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్‌తో దాదాపు 20 నిమిషాలపాటు రాష్ట్ర స్థితిగతులపై చర్చించారు.
తదనంతరం ప్రారంభించిన ప్రజాదర్బారులో తెలంగాణ సమస్యపైనే ఎక్కువ విజ్ఞప్తులు వచ్చాయి. తెలంగాణ సమస్యను పరిష్కరించాలని పలువురు ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలిసి వినతి పత్రాలను సమర్పించారు. కేవలం రాజకీయ పార్టీలను మాత్రమే కాకుండా తెలంగాణపై చర్చించేందుకు మేధావి వర్గాలు, ప్రజా సంఘాలకు కూడా అనుమతినివ్వాలని ఉపాధ్యాయ సంఘాల తరపున ఎన్నికైన ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి కోరారు. ఈ ప్రజా దర్బారు మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది.
ప్రజల నుంచి వస్తున్న వినతి పత్రాలను, విన్నపాలను గవర్నర్ ఓపికగా విని వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.