విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అదృశ్యమైన వ్యవహారంలో సస్పెన్షన్ వేటుకు గురైన బెజవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి, నలుగురు పోలీసు అధికారులపై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం శనివారం ఎత్తివేసింది.
ఈ వ్యవహారానికి సంబంధించి బెజవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు మరో నలుగురు అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్టు రాష్ట్ర డీజీపీ గిరీష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా లగడపాటి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను భగ్నం చేసి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన పోలీసుల కన్నుగప్పి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో శ్రద్ధ చూపలేదని ఆరోపిస్తూ.. బెజవాడ సీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు.. ఏసీబీ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.