ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » 5వ తేదీన సీమాంధ్రలో బ్లాక్ డే: సీమాంధ్ర జేఏసీ (United Andhra | Black day | Delhi | Chidambaram | Vijayawada)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై చర్చలు జరుపతలపెట్టిన జనవరి ఐదో తేదీన రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బ్లాక్‌డేను పాటించాలని సీమాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) తీర్మానించింది. విజయవాడ కేంద్రంగా బెజవాడ బెంజ్ సర్కిల్‌లో శనివారం 13 జిల్లాలకు చెందిన అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు.
ఇందులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పేరుతో సరికొత్త వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో మరికొన్ని తీర్మానాలు చేశారు. తెలంగాణ అంశంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం ఎనిమిది పార్టీలతో జరుపతలపెట్టిన చర్చల ప్రక్రియ రోజునే సీమాంధ్ర ప్రాంతాల్లో బ్లాక్‌డేగా పాటిస్తూ.. రైల్ రోకోలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను అడ్డుకోవాలని తీర్మానించారు.
అలాగే, నాలుగో తేదీన సీమాంధ్ర ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చింది. వీటితో పాటు. సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. సమైక్యానినాదాన్ని ఢిల్లీకి చేర్చాలని సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ రాజకీయ పార్టీల నేతలను కోరింది.
ఇదిలావుండగా, బెజవాడ బెంజ్ సర్కిల్‌లో జరిగిన ఈ సమావేశానికి సీమాంధ్ర ప్రాంతాల్లోని అన్ని విశ్వవిద్యాలయాలకు చెందిన జాక్ నేతలతో పాటు ప్రొఫెసర్లు.. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.