జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వైఎస్ మరణం వెనుక తెలంగాణ శక్తులు: రఘువీరా! (YS death | Telangana | Minister Raghuveera | Chidambaram | Hyd)
Bookmark and Share Feedback Print
 
ప్రజల మనిషి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం వెనుక తెలంగాణ శక్తుల హస్తం ఉందా అనే అనుమానం ఇపుడు కలుగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంతో భేటీ కానున్నట్టు ఆయన తెలిపారు.

శనివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం వ్యవహారంలో నిజానిజాలను ఇప్పటి వరకు వెల్లడించక పోవడం వెనుక గల ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి, ప్రజాపాలన అందించిన వైఎస్ దుర్మరణం వెనుక పలు సందేహాలు వస్తున్నాయన్నారు.

ముఖ్యంగా, తెలంగాణ అనుకూల దుష్టశక్తులు ఉండి ఉండవచ్చని ధర్మసందేహాన్ని ఆయన లేవనెత్తుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఆరంభమైన తర్వాత వైఎస్‌కు వ్యతిరేకంగా పలువురు తెలంగాణ నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే దుష్టశక్తి పోయిందని ఇకపై మనకెవరూ అడ్డులేరని ఆరోపణలు చేస్తున్నారు.

వైఎస్ చూపిన బాటలోనే తాము కూడా నడుస్తామన్నారు. తాను ముమ్మాటికీ సమైక్యవాదినేనని ఆయన నొక్కి వక్కాణించారు. ఈనెల ఐదో తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి చిదంబరంతో అన్ని విషయాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.