జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నేడు విద్యార్థి గర్జన.. ఉస్మానియాల గట్టి భద్రత! (JAC | Student | Osmania | Single jude | parties | Telangana)
Bookmark and Share Feedback Print
 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ సంయుక్త కార్యాచరణ కమిటి (జాక్) ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం విద్యార్థి గర్జన జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను నిర్వహించుకునేందుకు హైకోర్టు సింగిల్ జడ్జి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దీంతో జేఏసీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఇప్పటికే తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం, పది జిల్లాల నుంచి తరలి వచ్చే విద్యార్థులకు స్వాగతం పలకడం కోసం భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, ఇక్కడ పది జిల్లాలకు సంబంధించి ఉద్యోగాలు, విద్య, వనరుల విషయంలో జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన వివరాలను ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శన చేశారు.

ఆర్ట్స్ కళాశాల ప్రధాన ద్వారం ముందు ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఆహ్వానితులు ప్రసంగిస్తారు. అయితే, ఈ గర్జనకు రాజకీయ నేతలు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులను పాల్గొనడానికి వీలు లేదని కోర్టు షరతు విధించింది. చిన్నపాటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి పూర్తి బాధ్యత జేఏసీ నేతలో వహించాల్సి వుంటుందని, వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతామని కోర్టు పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.