ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సమైక్యాంధ్ర ఉద్యమంపై ఎస్వీలో అఖిలపక్షం భేటీ! (United Andhra | SV Versity | All party meet | Chidambaram | Exam)
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్న అంశంపై తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అఖిలపక్ష సమావేశం అత్యవసరంగా భేటీ అయింది. ఈనెల ఐదో తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణపై ఎనిమిది పార్టీలతో చర్చలు జరపనున్న నేపథ్యంలో.. అఖిలపక్ష సమావేశం భేటీ కావడం గమనార్హం.
ఇదిలావుండగా, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసింది. ఈనెల నాలుగు, ఆరు తేదీల్లో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు జరగాల్సివుండగా, వీటిని నిరవధికంగా వాయిదా వేసినట్టు ఎస్కే వర్శిటీ రిజిస్ట్రార్ రవీంద్రనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే, రాయలసీమ యూనివర్శిటీ పరిధిలో సోమవారం జరగాల్సిన మొదటి సెమిస్టర్ పరీక్షలను కూడా వాయిదా వేశారు. సంక్రాంతి పండుగ తర్వాత అంటే.. ఈనెల 18వ తేదీ తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.