జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సీమాంధ్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు: శైలజానాథ్ (United Andhra | Sailajanath | Rayalaseema | Telangana | Hyd)
Bookmark and Share Feedback Print
 
సమైక్య ఉద్యమంలో భాగంగా సోమవారం రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో జరుపతలపెట్టిన బంద్‌కు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ శైలాజానాథ్ తెలిపారు. దీనిపై సీమాంధ్రలోని విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగే బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా, దేశ రాజధానిలో ఈనెల ఐదో తేదీన జరుగనున్న ఎనిమిది పార్టీల సమావేశంలో చర్చించేందుకు సీమాంధ్రకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆదివారం సమావేశమయ్యారు. ఇందులో సీమాంధ్ర ప్రాంతం నుంచి ఎవరిని పంపాలి, ఎలాంటి వాదాన్ని వినిపించాలనే అంశంపై చర్చించారు.

ఇదిలావుండగా, ఆదివారం హస్తినకు మంత్రులు, ఎంపీలు వెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ... కేంద్రం జరిపే చర్చల్లో పాల్గొనే సమావేశంలో సీమాంధ్ర ప్రాంతం నుంచి పాల్గొనే ప్రతినిధి ఎవరైనా సరే ఈ ప్రాంత వాసుల వాదాన్ని బలంగా వినిపిస్తారని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.