ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రోశయ్య కంటే చంద్రబాబు బెటర్..!: దామోదర్ రెడ్డి (Chandrababu | Rosaiah | Damodar Reddy | Telangana | Seemandra)
ప్రత్యేక తెలంగాణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య కంటే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బెటర్ అని తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై దామోదర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ వ్యవహారంపై నోరు మెదపక, దాటవేసే రోశయ్యపై దామోదర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర, తెలంగాణలు తనకు రెండు కళ్లు లాంటివని చంద్రబాబు చేసిన ప్రకటనపై స్పందించారు. చంద్రబాబు నోట ఆ మాటైనా వచ్చిందని, కానీ రోశయ్య కళ్లు సీమాంధ్రను చూస్తున్నాయని దామోదర్ రెడ్డి అన్నారు.
కాబట్టి ఈ విషయంలో రోశయ్య కంటే చంద్రబాబు ఎంతో పర్వాలేదని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా సీమాంధ్రపైనే కన్నేసిన ముఖ్యమంత్రి ఇకనైనా తన భావన మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.