ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నాగ వైష్ణవి నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి! (Naga Vaishnavi | Vijayawada | Saiteja | Murder | Kidnap | Sriniavas)
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి హత్య కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ శనివారం ముగిసింది. ఈ దారుణ హత్యలో పాల్గొన్న నిందితులను వైష్ణవి సోదరుడు సాయితేజ గుర్తించాడు. సాయితేజను పోలీసులు శనివారం మధ్యాహ్నం విజయవాడ సబ్ జైలుకు తీసుకు వచ్చి న్యాయమూర్తి సమక్షంలో హంతకుల గుర్తింపు పరేడ్ నిర్వహించారు.
సంఘటన జరిగిన రోజున తాను తన చెల్లి నాగ వైష్ణవి కారులో స్కూలుకు వెళుతుండగా తమను అడ్డగించి, వైష్ణవిని అపహరించుకుపోయిన శ్రీనివాస్, జగదీష్‌లను సాయితేజ గుర్తించాడు.
ఇదిలావుండగా, వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితునిగా భావిస్తున్న వెంకట్రావు గౌడ్‌ను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. నిందితుల గుర్తింపు ప్రక్రియను పూర్తిగా వీడియోలో చిత్రీకరించారు.