జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చీఫ్‌విఫ్‌ భట్టి విక్రమార్కకు తృటిలో తప్పిన ప్రమాదం! (Bhatti Vikramarka | Accident | Auto | Escort | Regional | Hyd | Khammam)
Bookmark and Share Feedback Print
 
ప్రభుత్వ చీఫ్‌విఫ్ మల్లు భట్టి విక్రమార్క తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నల్గొండ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న భట్టి విక్రమార్క మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రభుత్వ చీఫ్‌విఫ్ భట్టి విక్రమార్క కాన్వయ్ జిల్లాలోని చౌటుప్పల్ మండలం, మల్కాపూర్, ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ఆటో ఒకటి ఢీకొంది.

ఈ ప్రమాదం నుంచి భట్టి విక్రమార్క మాత్రం క్షేమంగా బయటపడగా, అయితే ఎస్కార్ట్ పోలీసులు గాయపడ్డారు. అలాగే, ఆటోలో ఉన్న వారిలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.