జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు చెల్లవ్: హైకోర్టు (High court | Muslim | Reservations | YS Govt | Regional)
Bookmark and Share Feedback Print
 
రాష్ట్రంలోని ముస్లింలకు నాలుగు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జారీ అయిన ప్రభుత్వ జీవోను హైకోర్టు సోమవారం కొట్టిపారేసింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు కలిగిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధంగా లేదని ధర్మాసనం పేర్కొంది. దీనిపై ప్రభుత్వం 90 రోజులలో పై కోర్టుకు వెళ్ళవచ్చునని కూడా పేర్కొంది.

దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోను జారీ చేశారు. వీటిని నిరాకరిస్తూ.. వీహెచ్‌పి నేత మురళీధర్ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో రిజర్వేషన్లు నిలిపివేస్తూ అప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. త ర్వాత దీనిపై కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా కోర్టులో ఫిటిషన్లు దాఖలు చేశారు.

ఈ రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రభుత్వం కేవలం ఆరు జిల్లాల్లోనే సర్వే నిర్వహించిందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ జీవో లేదని స్పష్టం చేసింది. ప్రధానంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంటూ, ఈ జీవోను కొట్టివేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.