జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సీమాంధ్రలో కొనసాగుతున్న విద్యా సంస్థల బంద్! (Seemandhra | Education Institutions | Krishna | Arrest | Students | Bandh)
Bookmark and Share Feedback Print
 
గుంటూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన 14 యూనివర్శిటీల విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేయడాన్ని సీమాంధ్ర నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికి నిరసనగా సోమవారం సీమాంధ్ర ప్రాంతాల్లోని విద్యా సంస్థల బంద్‌ను శాంతియుతంగా పాటిస్తున్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా పాదయాత్రతో హైదరాబాద్‌కు బయలుదేరిన విద్యార్థి నాయకుల అరెస్టు‌కు నిరసనగా విద్యార్థులు ఈ బంద్‌ను పాటిస్తున్నట్టు విద్యార్థి సంఘాల జేఏసీలు ప్రకటించాయి. గాంధేయ మార్గంలో తాము కార్యక్రమం చేస్తుంటే, తమను బలవంతంగా కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారని వారు ఆరోపిస్తున్నారు.

సీమాంధ్ర ప్రాంతాల్లోని 14 యూనివర్శిటీలతో పాటుగా అన్ని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలుపాలని వారు కోరారు. బంద్‌కు సహకరించాలని పాదయాత్రలో అరెస్టై, మచిలీపట్నంలో విడుదలైన విద్యార్థి నాయకులు కోరారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.