జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » భవిష్యత్ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్...!? (Junior NTR | Chief Minister | Chandrababu | TDP | Congress | YSJ)
Bookmark and Share Feedback Print
 
File
FILE
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలో తనకంటూ స్టార్‌డమ్‌ను కైవసం చేసుకున్న యువ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి నట వారసత్వంతో పాటు.. తన నటన, మాటల చాతుర్యంతో ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చేసిన ప్రచారానికి కూడా జనం జేజేలు కొట్టారు. ప్రచారం చేసింది కొద్ది రోజులే అయినప్పటికీ.. ప్రచార కథన రంగంలో ఉన్నంత సేవు "అదుర్స్" అనిపించారు.

తాజాగా పెళ్లి వార్తలతో మరోమారు వార్తలకెక్కారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెళ్లి పెద్దగా స్టూడియో ఎన్ అధినేత ఏకైక కుమార్తె నార్నె లక్ష్మీ ప్రణీతని ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. లక్ష్మీ ప్రణీత చంద్రబాబు నాయుడు దత్త పుత్రిక అనే వార్తా కథనాలు మీడియాలో వస్తున్నాయి. అందువల్లే ఆమెను జూనియర్‌కు ఇచ్చి జూ.ఎన్టీఆర్‌ను తన అదుపాజ్ఞలో పెట్టుకునేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేసినట్టు సమాచారం.

ఇప్పటికే తన ఏకైక కుమారుడు లోకేష్‌కు సినీ నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని ఇచ్చి వివాహం చేశారు. దీంతో బాలకృష్ణ నారా వారి కుటుంబానికి మరింత దగ్గరయ్యారు. ఫలితంగా గత ఎన్నికల్లో బావను ముఖ్యమంత్రి చేసేందుకు రాష్ట్రమంతటా పర్యటించారు. ఒక వైపు బాబాయ్.. మరోవైపు అబ్బాయ్‌లు సుడిగాలి పర్యటన చేసినా తెదేపా విజయానికి ఆమడ దూరంలోకి వచ్చి ఆగిపోయింది.

ఈ ఎన్నికల ప్రచార సమయంలో జూనియర్ ఎన్టీఆర్ శక్తి సామర్థ్యాలను అంచనా వేసిన చంద్రబాబు.. సరికొత్త వ్యూహ రచన చేశారు. జూనియర్‌ను తన అదుపాజ్ఞల్లో పెట్టుకుంటే భవిష్యత్‌లో అధికారం తనదేనన్న ధీమాతో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతాల్లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఓటర్లను కూడా బాగానే ఆకర్షిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది. ఆ పార్టీలో ప్రజాదరణ కలిగిన నేతగా వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. అటు.. ధన, కండ బలాల్లో ఆయనను మించిన యువ నేత ఆ పార్టీలో ఎవరూ కనిపించడం లేదు. 2014 నాటికి కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తెరపైకి తెస్తే.. తెదేపా తరపున జూనియన్ ఎన్టీఆర్‌ను ప్రకటించాలని చంద్రబాబు వ్యూహ రచనగా ఉన్నట్టుంది.

ఇందుకోసం.. తన దత్త పుత్రికలాంటి లక్ష్మీ ప్రణీతని ఇచ్చి వివాహం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే జరిగితే.. తనకు భవిష్యత్‌లో సీఎం యోగం వరించినా.. వరించక పోయినా.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఆ పదవిలో కూర్చోబెట్టి తాను అధికారం చెలాయించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్.జగన్‌కు ఏవిధంగా మాస్ ఫాలోయింగ్ ఉందో.. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా మంచి ఆదరణ ఉంది. అందువల్ల వీరిద్దరు భవిష్యత్‌లో సీఎం రేసులో పోటీ పడే అవకాశాలు లేకపోలేదన్నది చంద్రబాబు ముందుచూపు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.