ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » శ్రీకృష్ణ కమిటీని రద్దు చేయాలి: సుప్రీంలో రిట్ (Srikrishna Committee | Supreme court | Telangana | Srikakulam)
ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీని రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటీషన్ దాఖలైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పురుషోత్తమ్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆమరణ దీక్ష చేసినంత మాత్రాన రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడటం భావ్యం కాదంటూ ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటీషన్‌పై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని పిటీషన్ దారుడు కోర్టుకు విన్నవించారు.
ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ పిటీషన్‌ను ఈనెల ఒకటో తేదీనే పురుషోత్తమ్ యాదవ్ దాఖలు చేసినట్టు సమాచారం.