ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మధుయాష్కీ.. ఓ బచ్చాగాడు: మహ్మద్ జానీ! (Madhu Yashki | Mohammed Jani | Telangana | Nizabamabad | Council)
నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీపై సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానం ఆగ్రహానికి గురైన యాష్కీ.. తాజాగా శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ మహ్మద్ జానీ కోపం కూడా చవిచాశారు.
నిన్నగాక మొన్న వచ్చిన మధుయాష్కీ తనపై విమర్శలు చేసే స్థాయికి ఎదిగాడా అంటూ మీడియా ముందు ప్రశ్నించారు. అతనో బచ్చా. రాజకీయ అనుభవమంత లేదు ఆ పిల్లోడి (మధుయాష్కీ) వయస్సు. అమెరికా నుంచి డబ్బు సంచులతో స్వదేశానికి తిరిగొచ్చాడు. కోట్లు వెచ్చించి పార్టీ టిక్కెట్ కొనుకున్నాడు. ఇలాంటి వారు తనను విమర్శించే స్థాయి ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ముస్లిం ప్రజానీకం యావత్తూ.. సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని తాను చెప్పానే తప్ప, తెలంగాణ ప్రాంత ప్రజలనో, రాష్ట్రాన్ని విభజించి మాట్లాడలేదని మహ్మద్ జానీ వివరణ ఇచ్చారు. దీనిపై ముధు యాష్కీర గత ఆదివారం జరిగిన ముస్లిం గర్జన సభలో ప్రసంగిస్తూ.. ఎవరో ఓ పెద్దాయన ముస్లింలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారట అది నిజమేనా అని ప్రజలను ఉద్దేశించి అడిగారు. ఆ తర్వాత ఆయన విమర్శలు గుప్పించారు.
దీనిపై జానీ స్పందించారు. తాను 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, మధుయాష్కీ ఐదున్నర సంవత్సరాల క్రితం అమెరికా నుంచి వచ్చి, డబ్బులు ఇచ్చి టిక్కెట్ తీసుకున్నారని విమర్శించారు. తాను ముస్లింల మనోభావాల గురించి చెప్పానే తప్ప మరో ఉద్దేశ్యం కాదన్నారు. తెలంగాణ తెచ్చుకుంటారా?, సమైక్యాంధ్రనే కొనసాగించుకుంటారా? అనేది మీ ఇష్టం, కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న తాను ఇలాంటి విషయాల్లో లాగొద్దని విజ్ఞప్తి చేశారు.