ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవద్దు: కేకే (Budget Sessions | AP Assembly | K Kesava Rao | Telangana Issue)
శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలతో బడ్జెట్ సమావేశాలకు లింకు పెడుతూ వాటిని అడ్డుకోవాలని ఆలోచన చేయవద్దని కే. కేశరావు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. తెలంగాణా ఏర్పాటుకోసమై కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిందనీ, అందులో భాగంగానే శ్రీకృష్ణ కమటీని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.
తెలంగాణా ప్రజలకు ఉన్న అనుమానాలను తాను హైకమాండ్ దృష్టికి తీసుకవెళతానన్నారు. కేంద్రం తెలంగాణా అంశాన్ని చాలా సీరియస్‌గా పరిశీలిస్తోందనీ, ఈ దశలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటే పరిస్థితి మారిపోతుందని అన్నారు.
మరోవైపు శ్రీకృష్ణ కమిటీలో తెలంగాణాకు అనుకూలంగా విధివిధానాలు లేకపోయినట్లయితే, తెలంగాణా ప్రాంత నాయకులందరూ తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని తెరాస నాయకుడు కేసీఆర్ మరోమారు పిలుపునిచ్చారు.