జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » బడ్జెట్ ఎలా ఆమోదిస్తారో చూస్తాం: టి.జీవన్ రెడ్డి (Budget | Jeevan Reddy | Telangana | Assembly | Congress | Hyd | Srikrishna)
Bookmark and Share Feedback Print
 
File
FILE
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా కొత్త బడ్జెట్‌ను ఎలా ఆమోదిస్తారో చూస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను ప్రకటించని పక్షంలో తమ ప్రాంతానికి చెందిన సభ్యులెవరూ బడ్జెట్ సమావేశాలకు హాజరుకారన్నారు.

దీనిపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీన నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సమాయత్తం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితుల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ విధి విధానాల ప్రకటనలో జాప్యం చేస్తుండడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు.

కమిటీ ఏర్పాటు చేస్తున్న ప్రకటన చేసిన కేంద్రం.. విధి విధానాలను వెల్లడించేందుకు ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఈనెలలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకుండా బడ్జెట్‌ను ఆమోదింపజేసుకునే శక్తి ప్రభుత్వానికి ఉండదబోదని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఒకవేళ విధి విధానాలు అనుకూలంగా లేనిపక్షంలో తామంతా ఏకంగా పార్టీనే వీడాల్సి వస్తుందని హెచ్చరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.